స్పెషల్ మట్టి పాత్రలతో ఉగాది కిట్.... కుండా, గ్లాస్ లు, జగ్గు, షడ్రుచులతో వస్తువులు

స్పెషల్ మట్టి పాత్రలతో ఉగాది కిట్.... కుండా, గ్లాస్ లు, జగ్గు, షడ్రుచులతో వస్తువులు
  • అసెంబ్లీ ఆవరణలో అందజేసిన పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉప యోగించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని 'మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుల వృత్తులను ప్రోత్సహించండి' నినాదంతో అసెంబ్లీ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉగాది కిట్అందజేశారు. 

అందులో పండుగకు అవసరమైన మట్టి కుండా, గ్లాస్ లు, జగ్గు, బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు, వేప పువ్వు, బెల్లం, చింతపండు, కారం వస్తువులు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజల కు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాం క్షలు తెలియజేశారు.

►ALSO READ | సికింద్రాబాద్ మహంకాళి ఏరియాలో ..పన్నీర్ కొంటున్నారా..? జాగ్రత్త.... 3 వేల కిలోల కల్తీ పన్నీర్ సీజ్