సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచండి: ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచండి: ఎంపీ వంశీకృష్ణ
  •  రిటైర్ అయిన వారికి తక్కువ ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • కోల్ మైన్స్ పెన్షన్ పథకం కమిషనర్ తో భేటీ
  • కార్మికుల పెన్షన్ సమస్యలపై కీలక చర్చ

కోల్ బెల్ట్: జీవితాంతం కష్టపడి పని చేసిన సింగరేణి కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే వారి పెన్షన్లు తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎంపీఎఫ్ కమిషనర్ అండ్ కోల్ కంట్రోలర్ సజీశ్ కుమార్ను ఆయన ఇవాళ న్యూఢిల్లీలోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోల్ మైన్స్ పెన్షన్ పథకం, 1998 కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పెన్షన్ సమస్యలపై కీలకంగా చర్చ జరిగింది. ప్రస్తుతం సింగరేణి నుంచి రిటైర్ అయిన కార్మికులకు వస్తున్న

చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెన్షన్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఫలితంగా వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పం దిస్తూ, ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.