మా భూభాగం నుంచి యుద్ధం చేస్తామంటే ఊరుకోం:అమెరికాకు UAE అల్టిమేటం

మా భూభాగం నుంచి యుద్ధం చేస్తామంటే ఊరుకోం:అమెరికాకు UAE అల్టిమేటం

మా భూభాగం ఉంచి ఇరాన్​ పై దాడి చేస్తామంటే ఊరుకోం..ఇరాన్‌పై జరిగే ఎటువంటి సైనిక చర్యలలో తమ గగనతలం, భూభాగం,జలాలను ఉపయోగించుకోకూడదని అమెరికాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE ) అల్టీమేటం జారీ చేసింది. ఈ విషయంలో ఎటువంటి లాజిస్టికల్ మద్దతును అందించమని స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభాలను పరిష్కరించేందుకు చర్చలు, ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటం, సార్వభౌమాధికారాన్ని గౌరవించడం అత్యంత ప్రభావవంతమైన పునాదులు అని UAE నమ్మకాన్ని పునరుద్ఘాటించింది.

ఇరాన్​లో పెరుగుతున్న ఆందోళనలు.. నిరసనలను అదుపు చేసేందుకు ఇరాన్​ కఠిన చర్యలు.. ఇరాన్​ లో నిరసనకారులపై అణచివేత కు ప్రతీకారం తప్పదని అమెరికా వార్నింగ్​.. ఇప్పటికే ఇరాన్​ సరిహద్దుల్లో సైనికబలగాల మోహరింపు.. పరిస్థితిపై ఖమేనీ, ట్రంప్​ ప్రకటనలు పరిస్థితిని మరింతి ఉధృతంగా మారుస్తున్న క్రమంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్​ పై యుద్దానికి దిగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అమెరికా ప్రత్యక్ష సైనిక చర్యలకు దిగితే ఇరాన్​ కు మద్దతుగా నిలిచే దేశాలు ఏవీ.. ఏయే దేశాలు అమెరికాకు సైనిక చర్యను సమర్థిస్తాయి అనే చర్చజరుగుతోంది. ఈక్రమంలో యూనైటెడ్​ అరబ్ ఎమిరేట్స్​ ఇరాన్​ కు పూర్తి స్థాయి మద్దతును ప్రకటించింది.

ఇరాన్ పని అయిపోయినట్లే.. అది మరో వెనెజులా అయ్యేలా ఉంది. అటు భారీ దాడికి అమెరికా రెడీ అవుతున్నట్లు.. ఖమేనీ బంకర్లలోకి పారిపోయినట్లు.. త్వరలో ఇరాన్ అమెరికా హస్తగతం అవుతుందని వార్తలు వినిపిస్తున్న క్రమంలో యూఏఈ ఈ ప్రకటన చేసింది. 

ఇరాన్​ లో అంతర్గత నిరసనలు.. 5వేలమంది నిరసనకారులు మృతిచెందిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులకు ట్రంప్​ మద్దుతు ప్రకటించడం.. నిరసనకారులను అణచివేస్తే సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్​ వార్నింగ్ తరవాత అమెరికా వార్​ షిప్​ , యుద్ద విమానాలు ఇరాన్​ ను చుట్టుముట్టాయి. మరోవైపు  ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ కూడా యుద్దానికే సిద్దమయినట్లు తెలుస్తోంది..  తన బాద్యతలను అతని కుమారుడికి అప్పజెప్పీ బంకర్లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి.

►ALSO READ | ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సముద్రంలో ఫెర్రీ మునిగి..18 మంది మృతి

ఇక యుద్దమే గనక వస్తే.. అమెరికాకే  ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. ఇరాన్​ పక్షాన నిలబడి అమెరికాను ఎదరించే శక్తులు  లేవు. వెనుజులాపై అమెరికా దాడి తర్వాత గ్లోబల్​ కమ్యూనిటీకి అమెరికాను అడ్డుకునే సామర్థ్యం లేదని తేలిపోయింది. ఇరాన్​ కు మద్దతుగా ప్రకటనలు, ఖండించడం చేయొచ్చుగానీ పూర్తిస్థాయిలో చేయగలిగేదేమీ లేదు. చైనాకు వెనుజులా లార్జెస్ట్ ట్రేడింగ్​ పార్టినర్​, వెనుజులా ఆయిల్స్​ లో లాభపడింది చైనా.. వెనుజులాలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మరోవైపు వెనుజులాలో రష్యాతో డిఫెన్స్​ కోఆపరేషన్​ కూడా వెనుజులాకు ఉంది.. అయినప్పటికీ వెనుజులాలో అమెరికా ఆపరేషన్​ ను రష్యా, చైనా అడ్డుకోలేకపోయాయి. ఆపరేషన్​ తర్వాత కూడా  ఏమీ చేయలేకపోయాయి. ఇదే అదనుగా అమెరికా ఇరాన్​ పై ఆధిపత్యం పెంచుకునే అవకాశాలున్నాయంటున్నారు.   

అమెరికా ఇరాన్ మధ్య యుద్దం మొదలైతే మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలి పోయే అవకాశం ఉంది. ఇరాన్​ కు మద్దతుగా రష్యా, చైనా,  ఉత్తర కొరియా దేశాలతోపాటు యూఏఈ సపోర్టుగా నిలవనున్నాయి. ఇరాన్​ కు అత్యాధినిక ఆయుదాలు, చైనా అంతర్జాతీయ వేదికలపై సపోర్టు, అమెరికాపై కోపంతో ఉత్తర కొరియా దేశాలు ఇరాన్​ పక్షాన నిలబడే ఛాన్స్​ ఉన్నప్పటికీ పూర్తి స్తాయిలో ఇరాన్​ ను ఆదుకునే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.