ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సముద్రంలో ఫెర్రీ మునిగి..18 మంది మృతి

ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సముద్రంలో ఫెర్రీ మునిగి..18 మంది మృతి
  •     మరో 24 మంది గల్లంతు..ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘోరం

మనీలా: ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 359 మందితో వెళ్తున్న ఎంవీ త్రిష క్రెస్టిన్ 3 అనే ఫెర్రీ నడి సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా, మరో 24 మంది గల్లంతయ్యారు. జంబోంగా సిటీ నుంచి జోలో ఐలాండ్ లోని సులు ప్రావిన్స్ కి వెళ్తుండగా ఫెర్రీ ప్రమాదవశాత్తూ నీటమునిగిందని అధికారులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బందితో కలిపి మొత్తం 359 మంది ఉన్నారని వివరించారు. 

సముద్రంలో బలమైన అలల తాకిడి వల్ల ఫెర్రీ తలకిందులైందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్, లోకల్ అథారిటీస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, 316 మందిని రక్షించారని తెలిపారు. మరో 24 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వివరించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.