మనం సినిమాలో ఈ పాట గుర్తుండే ఉంటుంది.. కనులను తాకే ఓ కల.. చూపే నిన్నిలా. టీటీటి టిటిటీ టీ.. అంటూ ఎంత సూపర్ హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు.. దాదాపు అన్ని భాషల్లో పాడి ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అర్జిత్ సింగ్.. తన ప్లేబ్యాక్ సింగర్ కెరీర్ కు గుడ్ బై చెప్పి షాకిచ్చారు. సింగింగ్ ప్రొఫెషనల్ కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మంగళవారం (జనవరి 27)న ప్రకటించారు. కొత్త అసైన్మెంట్స్ ఏవీ తోసుకోననటి సడెన్ గా ప్రకటించి ఫ్యాన్స్ కు షాకిచ్చారు.
తన ప్రొఫెషనల్ జర్నీలో కీలకమైన మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు అర్జిత్. తనకు ఎంతో మద్ధతు ఇస్తూ.. ప్రోత్సహిస్తూ వస్తున్న ఫ్యాన్స్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
హలో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.. అంటూ మొదలు పెట్టిన అర్జిత్.. నేను కొత్త అసైన్మెంట్స్ ఏవీ తీసుకోవడం లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొత్త జర్నీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నేను మంచి మ్యూజిక్ కు ఫ్యాన్ ను. భవిష్యత్తులో మరింత సంగీతం నేర్చుకుని సొంతంగా.. ఒక ఆర్టిస్ట్ గా మీ ముందుకు వస్తాను. కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి.ఈ ఇయర్ కూడా కొన్ని రిలీజ్ లు ఉన్నాయి. ఫ్యాన్స్ డిజప్పాయింట్ కావద్దు. మ్యూజిక్ చేయడం మాత్రం ఆపనని స్పష్టంగా చెబుతున్నా.. అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
అర్జిత్ టాప్ తెలుగు సాంగ్స్ :
- మాయ - నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.
- ఆ సీతదేవి నవ్వుల - రౌడీ ఫెలో.
- ఈక్షణం స్వయంవరం - రౌడీ ఫెలో.
- కనులను తాకే - మనం.
టాప్ 10 హిందీ సాంగ్స్:
- తుమ్ హీ హో – ఆశికీ 2
- చన్నా మెరేయా – ఏ దిల్ హై ముష్కిల్
- అగర్ తుమ్ సాథ్ హో – తమాషా
- రాబ్తా – ఏజెంట్ వినోద్
- ముస్కురానే – సిటీ లైట్స్
- కేసరియా – బ్రహ్మాస్త్ర
- ఏ దిల్ హై ముష్కిల్ (టైటిల్ సాంగ్) – ఏ దిల్ హై ముష్కిల్
- గెరువా – దిల్‌వాలే
- తేరా యార్ హూన్ మైన్ – సోను కే టిటు కీ స్వీటీ
- ఫిర్ లే ఆయా దిల్ (రిప్రైజ్) – బర్ఫీ!
