పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని దానం విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని..ఆపార్టీలోనే ఉన్నానని చెప్పారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినట్లు అధికారిక సమాచారం లేదన్నారు. 2024 మార్చ్ లో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని చెప్పారు. వ్యక్తిగత హోదాలో ఆ మీటింగ్ కు వెళ్తే పార్టీ మారానని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందన్నారు. మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు దానం. దానం అఫిడవిట్ పై స్పీకర్ ఎలా స్పందిస్తారనేది చూడాలి
దానంకు స్పీకర్ నోటీసులు
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. జనవరి 30న ఉదయం 10:30గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..
.
