ఖమ్మం: ప్రజాభవన్ లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యా రు. సీఎం రేవంత్ దేశంలో లేనందున మున్సిపల్ ఎన్నికలపై తనకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. మంత్రులు వారి సమస్యలు తెలియజేశారని ఆ విషయాలను ముఖ్యమంత్రికి వివరించానని చెప్పారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే రాసే వారితో చూపించే వారితో కలుస్తారా? అని ప్రశ్నించారు. తమ క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర భవిష్యత్తు తమ అందరి ఆలోచన లక్ష్యం అని స్పష్టం చేశారు. ము న్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని.. బల్దియాల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తా మని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా మధిరలో భట్టి మాట్లాడారు. 'మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాన్ని ప్రజాభవంలో చర్చించాం.నిజామాబాద్ పార్లమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల సమస్య ఎదురైనం దున అందుకు సంబంధించిన మంత్రులు నాతో సమావేశం అయ్యారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని కోరుకునేవారు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువమంది మున్సిప ల్ టికెట్లను ఆశిస్తారు అందులో తప్పులే దు. ఆ జిల్లా ఇన్చార్జి మంత్రులు స్థానిక శా సనసభ్యులు సమష్టిగా నిర్ణయం తీసుకొని గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు కేటాయిస్తరు. సింగరేణి టెండర్ల అంశంలో పూర్తి ఆధారాలతో స్పష్టత ఇచ్చాను. ఇంకా అందులోనే తిరుగుతాను అంటే వాళ్ల కర్మ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశాం. రేర్, క్యూర్ ప్యూర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధి కోసం గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం' అని తెలిపారు.
