అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాపై 100 శాతం టారిఫ్స్ విధిస్తానని బెదిరించిన వేళ అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతో బంగారం, వెండి రేట్లకు రెక్కలు వచ్చాయి. దీంతో వెండి రిటైల్ ధరలు ఎన్నడూ ఊహించని స్థాయిలకు పెరిగిపోవటంతో భారతీయులు షాక్ అవుతున్నారు. ఈ భారీ ర్యాలీ చూస్తున్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం త్వరలోనే క్రాష్ ఉంటుందని అంటున్నారు. మెుత్తానికి ఏదేమైనా రేట్లతో సంబంధం లేకుండా షాపింగ్ చేస్తూ పోతున్న వారు మాత్రం తమ నగరాల్లో తాజా ధరలను గమనించి ముందుకెళ్లటం ఉత్తమం.
జనవరి 28న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.322 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16వేల 517గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 140గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
గోల్డ్ తర్వాత వెండి విషయాన్ని పరిశీలిస్తే అస్సలు బ్రేక్ లేని ర్యాలీని కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. మంగళవారం జనవరి 28, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.4లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.400 వద్ద ఉంది.
