తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి..

 తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి..

 తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.  ఫిబ్రవరి 16 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎన్నికల కోడ్ అమలుతో ప్రభుత్వ పథకాలు ప్రకటన, బదిలీలపై నిషేదం ఉంటుంది .

మున్సిపల ఎన్నికల షెడ్యూల్

  • జనవరి 28 నుంచి నామినేషన్లు ప్రారంభం
  • జనవరి 30 వరకు నామినేషన్ల తుది గడువు
  • జనవరి 31న నామినేషన్ల పరిశీలన
  • ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్ డ్రాకు గడువు
  • ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • ఫిబ్రవరి 13న ఫలితాలు
  • ఫిబ్రవరి 16న మేయర్,మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక


రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్​ కమిషన్​8,195 పోలింగ్​స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్​ స్టేషన్​లో సుమారు 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 

బ్యాలెట్ ​పద్ధతిలో పోలింగ్​ నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో టైమ్​ ఎక్కువగా తీసుకుంటుందనే అభిప్రాయంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్​ ప్రక్రియలో 1,390 మంది ఆర్వోలు, 1,480 మంది ఏఆర్వో లు పాల్గొననున్నారు. వీరి వివరాలను జిల్లాలవారీగా టీ పోల్​ యాప్​లో నమోదు చేశారు.