రేగొండ/ మొగుళ్లపల్లి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మేడారం భక్తలకు మహాలక్ష్మి పథకం వర్తింపు ద్వారా సేవలు అందిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. మంగళవారం రేగొండ, గణపురం, చిట్యాల మండల కేంద్రాల్లో మేడారం బస్సు సర్వీస్ పాయింట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్సు సర్వీస్ పాయింట్లతో పాటు భక్తులకు నీడ, తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గూటోజు కిష్టయ్య, మంలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు సర్పంచ్ఎలిగేటి తిరుపతి, ఉప సర్పంచ్ రేణికుంట్ల రవి ఎమ్మెల్యేను కలిసి గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
