వన దేవతల గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ దివాకర

వన దేవతల గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ దివాకర

తాడ్వాయి/ వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని ములుగు కలెక్టర్​ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మేడారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

అనంతరం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఊరట్టం జీపీ కొత్తూరు హ్యాబిటేషన్​లో జరుగుతున్న పారిశుధ్య పనులను, అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గోవిందరావుపేట మండలం పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్​ను పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.