గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారిని మంగళవారం ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మైనంపాటి రామచంద్ర, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, భక్తులు, దేవాలయ ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.
ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
కాశీబుగ్గ, వెలుగు: ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్టీసీ వరంగల్ డిపో మేనేజర్ భూక్య ధరాంసింగ్, ఇంతేజార్ గంజ్ సీఐ ఎంఏ షుఖూర్ అన్నారు. మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ నివారించే క్రమంలో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి జ్యూటుతో తయారు చేసిన బ్యాగులను మంగళవారం వరంగల్ సిటీలోని బస్సు స్టేషన్వద్ద వారు ఉచితంగా పంపిణీ చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించేందుకు బ్యాగులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
