- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
నస్పూర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చూపు బీజేపీ వైపు ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ జోన్ 26(సుందరయ్య కాలనీ), 3వ డివిజన్ (కృష్ణకాలనీ)లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అనేక సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మంచిర్యాల మేయర్గా బీజేపీ అభ్యర్థిని గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరాన్ని ఒక్క స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ముఖేశ్ గౌడ్, రమేశ్, బరుపాటి మారుతి, రావణవేణి శ్రీనివాస్, పి.మధు, బి.తిరుపతి, మహేందర్, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.
