రెండు మూడు రోజులుగా గ్యాస్ కొరత ఉండడంతో ఏజెన్సీల ముందు నో స్టాక్ బోర్డులు కనిపించాయి. బుధవారం ఉదయం గ్యాస్ వచ్చిందన్న సమాచారం తెలియడంతో ఆదిలాబాద్లో గ్యాస్ ఏజెన్సీలకు జనాలు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్లతో క్యూలో నిల్చున్నారు. మరికొందరు గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయం ఎదుట క్యూ కట్టారు.- ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, వెలుగు
