రామకృష్ణాపూర్ లో ముస్లింలకు తోఫా పంపిణీ

రామకృష్ణాపూర్ లో ముస్లింలకు తోఫా పంపిణీ

కోల్​బెల్ట్​,వెలుగు: రంజాన్​ పండుగను పురస్కరించుకొని  మంత్రి  వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో  బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని ఏజోన్​ బిలాల్​ మసీదులో  తోఫా పంపిణీ జరిగింది.  

పట్టణ ముస్లిమ్​ మైనార్టీ వెల్ఫేర్​  కమిటీ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నేత అబ్దుల్​అజీజ్​ ముస్లింలకు తోఫా అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కాంగ్రెస్ సర్కార్, మంత్రి వివేక్​ వెంకటస్వామి  ముస్లింల సంక్షేమానికి కృషి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మసీదు సదర్​ ఆరీఫ్​,నూరూల్. ఆరీఫ్, ఖాజా షరీఫ్, ఖాజా భాయ్, ఇమ్రాన్,షబ్బీర్   పాల్గొన్నారు.