హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఫార్చ్యూన్ విండోస్ అండ్ డోర్స్ సంస్థ పేరు ఇండిఫ్రేమ్గా మారింది. భారతీయ ఇండ్ల అవసరాలకు తగ్గట్టుగా కిటికీలు, తలుపుల తయారీలో నాణ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది.
టైటాన్ క్యాపిటల్ లాంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుంచి ఈ సంస్థ 5.55 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఇప్పటికే 100 ప్రాంతాల్లో 800 ప్రాజెక్టులను పూర్తి చేశామని ఇండిఫ్రేమ్ సీఈఓ దిలీప్ కుమార్ చెప్పారు. త్వరలో యూపీవీసీ తో పాటు అల్యూమినియం, కలప ఉత్పత్తుల్లోకి విస్తరిస్తామని, పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో పనులను పర్యవేక్షిస్తామని ఆయన వివరించారు.
