CAT Movie: జీవీ నాయుడు ‘క్యాట్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. టీమ్‌కు డైరెక్టర్ బుచ్చిబాబు బెస్ట్ విషెస్

CAT Movie: జీవీ నాయుడు ‘క్యాట్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. టీమ్‌కు డైరెక్టర్ బుచ్చిబాబు బెస్ట్ విషెస్

జీవీ నాయుడు లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాట్’. వీజే బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రలు పోషించారు. వై గంగాధర్ ఐపీఎస్ సమర్పణలో రజని గొంగటి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

డ్రామా, థ్రిల్లర్ జానర్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ఈ చిత్రం చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంటుందని, ప్రేక్షకులను కచ్చితంగా ఎంగేజ్ చేస్తుందని జీవీ నాయుడు అన్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. మారుతి రాజా సంగీతం అందిస్తున్నాడు.