సమంత నిర్మించిన ‘శుభం’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి. ఇప్పుడు హర్షిత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘దీవాన’. ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా శ్రీకాంత్ సంగిశెట్టి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్గా ‘దీవాన’ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం, హర్షిత్ రెడ్డి కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని టీజర్ చూస్తే అనిపిస్తోంది.
ప్రేమలోని గాఢతను చూపించేలా టీజర్ సాగింది. ‘‘చస్తావాబే పిల్ల కోసం.. నువ్వేం చిల్లర్ గానివిబే’’ అని స్నేహితుడు నిలదీస్తే, ‘‘నా నజర్‌లో ఇప్పుడు అది ఒక్కటే రా బ్యూటీ… అందుకే నాకు అదే కావాలి’’ అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే ‘‘అమ్మాయిలు ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు’’ అనే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు వినిపించే సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది.
“పెదవులు సడిగా, పెకలని సడిలా
మనసుకి తగిలిన కలుగుల పిడుగు ఏంటో..
ఇది ప్రేమ.. ప్రేమ...
గుండెల్లో సడి రేపే ప్రేమా..
లోలో జరిగే రణమే ప్రేమ..
యెదలో కురిసే వానా..” అనే లిరిక్స్ ప్రేమలోని భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో కూడిన లవ్ ఎమోషనల్ సినిమాగా ‘దీవాన’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు.
