Polimera 3: ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్.. స్పెషల్ గ్లింప్స్‌తో మేకర్స్ బిగ్ సర్ప్రైజ్!

Polimera 3: ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్.. స్పెషల్ గ్లింప్స్‌తో మేకర్స్ బిగ్ సర్ప్రైజ్!

హారర్ జానర్‌లో సంచలనం సృష్టించిన ‘పొలిమేర’ ఫ్రాంచైజీ, మరో భారీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ‘పొలిమేర 3’ చిత్రాన్ని ప్రకటించిన మేకర్స్, తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందించారు. స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ఈ ఫ్రాంచైజీలో భాగమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ‘పొలిమేర 3’లో మరింత భయానకమైన కథ, కొత్త మలుపులు ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. ఈ అనౌన్స్తో పాటు మేకర్స్ ట్వీట్ చేస్తూ.. ‘‘యాక్షన్ మీట్స్ పవర్ కంటెంట్– ఇక సెన్సేషన్ మొదలు. ఇటీవలే ‘బ్లాస్ట్ జోన్'తో ప్రేక్షకులను అలరించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు  ‘పొలిమేర 3’లో చేరి ఈ ఫ్రాంచైజీ ఇంపాక్ట్‌ను మరింత పెంచబోతున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు.

అసలు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న స్థాయిలో మొదలైన పొలిమేర.. ఇప్పుడు భారీ హారర్ & థ్రిల్లర్ ఫ్రాంచైజీగా మారింది. ఇక ఇలాంటి హార్రర్ థ్రిల్లర్ ప్రపంచంలోకి ఏకంగా టాప్ హీరో అర్జున్ ను రంగంలోకి దించడంతో, పార్ట్ 3లో కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది.

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. ఇందులో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.