పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఫౌజీ’ (FAUZI). బ్లాక్ బస్టర్ క్లాసిక్ మూవీ ‘సీతారామం’ను తెరకెక్కించిన హను రాఘవపూడి నుంచి సినిమా వస్తుండటంతో ఈ పీరియాడిక్ వార్ డ్రామాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అంతే గ్రాండ్గా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, సెకన్ల పాటి గ్లింప్స్ రిలీజై ప్రభాస్ ఫ్యాన్స్ ని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఆ క్రేజీ టాక్ ఏంటనేది ఓ లుక్కేద్దాం..
‘ఫౌజీ’లో మరో క్రేజీ కాస్టింగ్..
‘ఫౌజీ’ నుంచి ఓ క్రేజీ టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అలనాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ప్రభాస్ తల్లి పాత్రలో జయప్రద నటించనున్నారని, కథను మలుపు తిప్పే ఎమోషనల్ పాత్ర ఇది అని అంటున్నారు. అయితే ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆగస్టు 14న స్పెషల్ గ్లింప్స్..
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. డార్లింగ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ, ఆగస్టు 14న ఈ సినిమా నుంచి ఒక భారీ 'స్పెషల్ గ్లింప్స్' (Glimpse)ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా డబ్బింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని ఈ ఎపిక్ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకు ముందుకు రానుంది.
1970ల యుద్ధ నేపథ్యంతో ‘ఫౌజీ’
1970ల నాటి యుద్ధం: ఈ సినిమా 1970ల నాటి సైనిక నేపథ్యం (ఫ్రీ-ఇండిపెండెన్స్/వార్ డ్రామా) ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో ఓ సైనిక అధికారిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వి ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
On 3rd DECEMBER 2026,
— Hanu Raghavapudi (@hanurpudi) July 16, 2026
the #Fauzi march begins. ❤️🔥
Come witness a story that won't just unfold on the big screen, it will live on in the hearts of everyone who believes in courage, honor, and freedom.🇮🇳#FauziOnDec3 pic.twitter.com/2cVEk56WlN
సాంగ్స్ అప్డేట్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్:
సీతారామం'కి అద్భుతమైన క్లాసిక్ మెలోడీలు అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు అద్భుతమైన ట్యూన్స్ సిద్ధమయ్యాయని సమాచారం. అదేవిధంగా ఈ చిత్రంలో భారీ స్థాయిలో వార్ సీక్వెన్సులు, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 1970ల కాలాన్ని ప్రతిబింబించే భారీ సెట్లను ప్రత్యేకంగా నిర్మించినట్లు సమాచారం.
The rhythm that marches with emotion.
— Fauzi (@FauziTheMovie) November 8, 2025
The sound that leads the #Fauzi battalion 🎼
Wishing the heartbeat of our battle, @Composer_Vishal, a very Happy Birthday ❤🔥
Rebel Star #Prabhas #Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop… pic.twitter.com/cAzowNQPDO
