Dhurandhar 2 Song: ‘ధురంధర్ 2’ నుంచి మరో చార్ట్‌బస్టర్.. ‘ఆరి ఆరి’ సాంగ్‌తో సోషల్ మీడియా హల్‌చల్

Dhurandhar 2 Song: ‘ధురంధర్ 2’ నుంచి మరో చార్ట్‌బస్టర్.. ‘ఆరి ఆరి’ సాంగ్‌తో సోషల్ మీడియా హల్‌చల్

‘ధురంధర్ 2’ (Dhurandhar 2) మానియా రోజురోజుకూ అంచనాలను మరింత పెంచుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈసారి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పాన్-ఇండియన్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా కేవలం వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్.

ఈ సందర్భంగా ‘ఆరి ఆరి..’ (Aari Aari) అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పటికే ట్రైలర్‌లో వినిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు పూర్తి సాంగ్ విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ పాటను సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్ కంపోజ్ చేశారు. సింగర్స్ నవ్ తేజ్ సింగ్ రేహాల్ (బాంబే రాకర్స్), శాశ్వత్ సచ్ దేవ్, ఖాన్ సాబ్, జాస్మిన్, సుధీర్, యదువంశీ కలిసి పాడారు. ఈ పాట 2000లో విడుదలైన బాంబే రాకర్స్ యొక్క పాపులర్ సాంగ్ ‘అరి అరి’కి రీక్రియేటెడ్ వెర్షన్‌గా రూపొందించడం విశేషం. 

టాక్ ఎలా ఉందంటే:

సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ పరంగా చూస్తే ఈ పాటను చాలా ఆకట్టుకునేలా మళ్లీ రూపొందించారు. అతి త్వరలోనే చార్ట్‌బస్టర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వీడియో విషయంలో మాత్రం కొత్తగా చూపించిందేమీ లేదని టాక్ వస్తుంది. ఈ సాంగ్ వీడియోలో ఎక్కువగా టీజర్, ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాలనే మళ్లీ ఉపయోగించారని అసహనం వ్యక్తం అవుతుంది.

►ALSO READ | విజయ్‌కు కుమారుడు షాక్.. తండ్రి పేరు తొలగించిన జాసన్ సంజయ్!

అయితే, సినిమా కథలోని కీలక అంశాలను ముందుగానే బయటపెట్టకూడదనే ఉద్దేశంతో మేకర్స్ కొత్త సీన్లు చూపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ పాటలో కొంత కొత్త ఫుటేజ్ ఉంటుందని ఆశించారు. 

ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ‘ఆరి ఆరి’ సాంగ్ విడుదల కావడంతో ఆ హైప్‌కు మరింత బలం చేకూరినట్లైంది. ఫస్ట్ పార్ట్ ధురంధర్ లో ఉన్న నా దే దిల్ పరదేశి ను పాట ఎంతగా పాపులర్ అయిందో, ఇప్పుడు ‘ధురంధర్ 2’లో ‘ఆరి ఆరి’ కూడా అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి ఏమవుతుందో!