విజయ్‌కు కుమారుడు షాక్.. తండ్రి పేరు తొలగించిన జాసన్ సంజయ్!

విజయ్‌కు కుమారుడు షాక్.. తండ్రి పేరు తొలగించిన జాసన్ సంజయ్!

తమిళి స్టార్ హీరో , తమిళగ వెట్రికళగం ( TVK ) అధినేత దళపతి విజయ్ కు తన కుమారుడు జాసన్ సంజయ్ ఊహించని షాక్ ఇచ్చారు. జాసన్ తన తండ్రి ఇంటి పేరును తొలగించారు.  ఇప్పటికే తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడంతో ఇది ఇప్పుడు ఆయన కొడుకు కూడా దూరం అవవ్వడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.  సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేళ ఆయన ఇంటి నుంచే ఇప్పుడు పెను సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.

విజయ్-సంగీత విడాకుల రగడ

గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడిగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ, ఇటీవల అవి నిజమని తేలింది. సంగీత చెంగల్పట్టు  ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తనను మానసిక వేదనకు గురిచేశారని, ఒక ప్రముఖ నటితో ఆయనకు ఉన్న సంబంధమే దీనికి కారణమని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనకు, పిల్లలకు భరణం చెల్లించాలని ఆమె కోర్టును కోరారు.

తండ్రికి షాకిచ్చిన కొడుకు..

విజయ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న జాసన్ సంజయ్, తన తండ్రికి మద్దతుగా నిలుస్తారని అభిమానులు ఆశించారు. కానీ, తండ్రి ప్రవర్తన పట్ల అసంతృప్తితో ఉన్న జాసన్.. తన తండ్రి పేరులోని మొదటి అక్షరం 'V' (విజయ్)  పేరు నుంచి తొలగించిట్లు సమాచారం. ప్రస్తుతం జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' (Sigma) అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర టైటిల్ కార్డ్‌లో తన పేరును "Jason Sanjay S" అని మార్చుకున్నారు. ఇక్కడ 'S' అంటే తన తల్లి 'సంగీత' అని అర్థం వచ్చేలా చేర్చారు.  తన అధికారిక సంతకాల్లో కూడా తండ్రి పేరును వాడటం మానేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో 'అన్‌ఫాలో'

జాసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. చెల్లెలు దివ్యషా పట్టభద్రురాలైన వేడుకకు కూడా విజయ్ హాజరుకాకపోవడం, కేవలం జాసన్ మాత్రమే తల్లి పక్కన ఉండటం వారి మధ్య ఉన్న దూరాన్ని స్పష్టం చేస్తోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో విజయ్ స్పందిస్తూ.. నా వ్యక్తిగత విషయాల గురించి వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దు, మనం ప్రజల కోసం పనిచేద్దాం అని కార్యకర్తలకు సూచించినప్పటికీ, కుమారుడి చర్యతో ఆయన ఇమేజ్‌కు గట్టి దెబ్బ తగిలిందని నెటిజన్లు భావిస్తున్నారు.

 విజయ్ తన రాజకీయ ప్రచారంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే, సొంత భార్య కోర్టు మెట్లు ఎక్కడం ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధంగా మారింది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, తల్లి పేరుతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జాసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఈ కుటుంబ కలహాలు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి..

►ALSO READ | రాజేంద్రప్రసాద్‌పై విశాల్ సీరియస్.. తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..!