టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ద్రిషిక చందర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్ర పోషించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మార్చి 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఇందులో భాగంగానే ‘సుయోధన’ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది.
అంతేకాకుండా.. ఈ సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఒక మనిషిని ‘సుయోధన’ అని ఎందుకు పిలుస్తారు? అదే వ్యక్తిని ‘దుర్యోధన’గా ఎందుకు భావిస్తారు? అనే ఆసక్తికరమైన పాయింట్‌పై కథ నడుస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
►ALSO READ | Allu Arjun: శిరీష్-నయనికను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు.. అల్లు బ్రదర్స్ ఎమోషనల్ పోస్టులు వైరల్
ఈ చిత్రంలో ప్రియదర్శి చాలా సీరియస్ రోల్లో కనిపిస్తున్నాడు. ఒక అంతుచిక్కని మిస్టరీని ఛేదించే వ్యక్తిగా ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు.
