హైదరాబాద్, వెలుగు: దక్షిణాదిలోనే అతిపెద్ద హోమ్ సొల్యూషన్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్ శంషాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు ఏబీసీ స్పేసరీ ప్రకటించింది. దాదాపు 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఈనెల 29న ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏబీసీ గ్రూప్ ఇంటర్నేషనల్, పటేల్ మార్కెటింగ్, శుభగృహ గ్రూప్ కలిసి ఈ కేంద్రాన్ని రూపొందించాయి. ఇక్కడ ప్రీమియం టైల్స్, శానిటరీవేర్, కిచెన్, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులు లభిస్తాయి.
