మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వార్త దేశాన్ని విషాదంలో పడవేసింది. బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఐదుగురు చనిపోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా.. బారామతి ఎయిర్ పోర్టులో ప్లేన్ క్రాష్ అయ్యింది. VT-SSK లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
జిల్లా పరిషద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబై నుంచి బారామతి వెళ్తుండగా.. బారామతి జిల్లాలో ప్లేన్ క్రాష్ అయ్యింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం తో పాటు విమానంలో ఐదు మంది ఉన్నారు. ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారి, ఒక అటెండెంట్ ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు క్రూ మెంబర్లు కూడా విమానంలో ఉన్నారు. VSR విమాన సంస్థ ఆధ్వర్యంలో నడిచే Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురి కావడం విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు చనిపోయినట్లు డీజీసీఏ ప్రకటించింది.
