పోస్టర్, అన్వేషి వంటి సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ దాట్ల ‘సోల్ ట్రిప్’ పేరుతో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ప్రారంభించాడు. తన సొంత బ్యానర్ గండభేరుండ ఆర్ట్స్‌పై ఈ సెలబ్రిటీ టాక్‌షో సీజన్1ను ముగించుకుని, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశాడు.
ఈ మొదటి సీజన్‌లో నటులు జగపతిబాబు, శ్రీకాంత్, అలీ, హీరోయిన్స్ శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ తదితరులు పాల్గొన్నట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
