అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ పై డీజీసీఏ రిపోర్ట్.. ఏం చెప్పిందంటే..?

అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ పై డీజీసీఏ రిపోర్ట్.. ఏం చెప్పిందంటే..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్సీపీ లీడర్ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటి సీఎం అజిత్ పవర్ జనవరి 28న ప్లేన్ క్రాష్ లో దుర్మరణం పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బారామతికి ప్రయాణిస్తున్న సమయంలో జరిగింది ప్రమాదం. ప్రమాద సమయంలో ఇందులో 5 మంది ఉన్నారని, ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా ప్రకటించింది. 

ప్రమాదంపై డీజీసీఏ విడుదల చేసిన పూర్తి రిపోర్ట్ పరిశీలిస్తే.. బారామతిలో క్రాష్ అయిన విమానంలో డిప్యూటి సీఎం అజిత్ పవార్ ఆయన పీఎస్ఓ(సెక్యూరిటీ అధికారి), ఒక అటెండెంట్ ఉన్నారని చెప్పారు. దీనికి తోడు ఇద్దరు క్రూ కూడా ఉన్నారని పేర్కొంది. పవార్ లియర్ జెట్ 45 విఎస్ఆర్ అనే ఆపరేటర్ నడుపుతున్న విమానంలో ప్రయాణించారని ఏజెన్సీ వెల్లడించింది. ఈ విమానం నంబర్ VT-SSK అని చెప్పింది. 

మహారాష్ట్ర బారామతి ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రాచారంలో భాగంగా 4 కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ప్రయాణించినట్లు వెల్లడైంది. వాస్తవానికి బారామతి ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగిందని ఎయిర్ పోర్ట్ మేనేజర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ మెుత్తం 6 బాడీలను ఆసుపత్రికి తరలించినట్లు పూణే పోలీసు అధికారులు వెల్లడించారు. వాటిలో మెుదటిగా మూడింటిని గుర్తించినట్లు చెప్పారు. 

ప్రమాదం సంభవించిన బారామతి ఎయిర్ పోర్ట్ ప్రైవేటు సంస్థ నడిపిస్తోంది. ఇటీవలే దానిని మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవల్మెంట్ కంపెనీ స్వాధీనం చేసుకుంది ఆపరేషన్స్. ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేందుకు వెళ్లిన అజిత్ పవార్ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపుగా చెప్పుకోవచ్చు.