ఇటీవల లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ సీ25ను బజాజ్ ఆటో..సిద్ధి వినాయక బజాజ్ సంస్థ ద్వారా హైదరాబాద్లో మార్కెట్లోకి మంగళవారం తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఇందులో కలర్ టీఎఫ్ టీ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ధర నుంచి రూ.87,100 నుంచి మొదలవుతుందని సిద్ధి వినాయక గ్రూప్ చైర్మన్ బాబుల్ రెడ్డి చెప్పారు.
