మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మరణ వార్త తెలిసిన వెంటనే సీఎం దేవేందర్ ఫడ్నవీస్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అజిత్ పవార్ ప్రాజా నాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు.కింది స్థాయి కార్యకర్త నుంచి సంబంధాలు ఏర్పరుచుకుని తనకంటూ ప్రత్యేకత చాటుకున్న నేత అని అన్నారు. పరిపాలనపై అతనికున్న పట్టు, పేదలు, మహిళల సాధికారత కోసం అతని పట్టుదల మాటల్లో చెప్పలేదనిఅన్నారు.
బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా.. బారామతి ఎయిర్ పోర్టులో ప్లేన్ క్రాష్ అయ్యింది. VT-SSK లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
అజిత్ పవార్ మృతిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పవార్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ .
