ఆర్మూర్ లో నామినేషన్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా

ఆర్మూర్ లో నామినేషన్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా

​ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ టౌన్​ లోని ప్రభుత్వ బాలికల జూనియర్​ కళాశాలను నామినేషన్​ స్వీకరణ కేంద్రంగా ఎంపిక చేశారు.  మంగళవారం సబ్​ కలెక్టర్ అభిజ్ఞాన్​ మాల్వియా సెంటర్​ను పరిశీలించారు. నామినేషన్​ స్వీకరణ కేంద్రంలో 36 కౌన్సిల్ స్థానాలకు12 సెంటర్స్​ ఏర్పాటు చేశామని, ఒక్కో విభాగంలో మూడు కౌన్సిల్​ స్థానాలకు చెందిన నామినేషన్లను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఒక్కో సెంటర్​ లో ఒక రిటర్నింగ్ ఆఫీసర్​, ఒక అసిస్టెంట్​ రిటర్నింగ్ ఆఫీసర్​ డ్యూటీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్​ ఉమా మహేశ్వర్ రావు, మున్సిపల్ మేనేజర్​ శ్రీనివాస్​, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.