కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మెడికల్ కాలేజీకి అదనంగా భూకేటాయింపుతో పాటు అప్రోచ్‌రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మెడికల్ కాలేజీకి కేవలం 7 ఎకరాలు మాత్రమే కేటాయించారని, భవిష్యత్‌లో కాలేజీ విస్తరణతో పాటు ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా భూమి కేటాయించాలని కోరారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం నుంచి 26 ఎకరాల స్థలం కేటాయించాలని విన్నవించారు. మెయిన్ రోడ్డు నుంచి డిగ్రీ కాలేజీ పక్క నుంచి మెడికల్ కాలేజీ వరకు 6 అడుగుల వెడల్పుతో అప్రోచ్‌రోడ్డు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
