Sumathi Sathakam: మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్‌లో ‘సుమతీ శతకం’.. ఆకట్టుకుంటోన్న ‘నా కుట్టీ’ సాంగ్

Sumathi Sathakam: మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్‌లో ‘సుమతీ శతకం’.. ఆకట్టుకుంటోన్న ‘నా కుట్టీ’ సాంగ్

అమర్‌‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన చిత్రం ‘సుమతీ శతకం’.  ఫిబ్రవరి 6న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా పాల్గొన్నారు. 

‘సుమతి సుమతి’ అనే పల్లవితో సాగే ఈ పాటను సుభాష్ ఆనంద్ కంపోజ్ చేయగా  గోల్డ్ దేవరాజ్ పాడాడు. ‘నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ..’ అంటూ కృష్ణ మాదినేని రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

అమర్దీప్ తాను ప్రేమించిన అమ్మాయి గురించి పాడుతున్నట్టుగా చిత్రీకరించారు.  టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.