DhurandharTheRevenge: ‘ధురంధర్’ ది రివేంజ్ పబ్లిక్ టాక్.. హిట్టో.. ఫట్టో ప్రేక్షకులు తేల్చేశారు !

DhurandharTheRevenge: ‘ధురంధర్’ ది రివేంజ్ పబ్లిక్ టాక్.. హిట్టో.. ఫట్టో ప్రేక్షకులు తేల్చేశారు !

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఘన విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన సినిమా ‘ధురంధర్’ ది రివేంజ్ (DhurandharTheRevenge). ‘ధురంధర్2’ సినిమాగా కూడా చెబుతున్న ‘ధురంధర్’ ది రివేంజ్ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సీక్వెల్పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రేక్షకులు, సినీ సమీక్షకుల నుంచి వన్ సైడ్గా పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. సినిమా ఆద్యంతం అలరించిందని.. కొన్ని సన్నివేశాల్లో దేశభక్తి ఉప్పొంగుతుందని.. 3 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా సినిమా నడిచిందనేది పబ్లిక్ టాక్.

దాదాపు 4 గంటల పాటు ఉన్న ఈ సినిమాకు నిడివి సమస్య అవుతుందేమోననే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమైంది. ఈ పాజిటివ్ టాక్ సినిమా కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. బుక్ మై షోలో గంటకు దాదాపు 60 వేల టికెట్లు బుక్ అవుతున్నాయంటే సినిమా టాక్ బుకింగ్స్కు ఎంత కలిసొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీక్వెల్ అర్థం కావాలంటే కచ్చితంగా ‘ధురంధర్’ ఫస్ట్ పార్ట్ చూడాల్సిందే. రణ్ వీర్ సింగ్ నటనపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. లైఫ్ టైం పర్మామెన్స్ అని సినిమా చూసొచ్చిన ప్రేక్షకులు రణ్ వీర్ సింగ్ నటనకు కితాబిస్తున్నారు.

‘ధురంధర్2’ తెలుగులో చూడాలనే ప్రేక్షకులు శుక్రవారం వరకూ వేచి చూడక తప్పేలా లేదు. హైదరాబాద్ సిటీ మొత్తం మీద గురువారం రోజు రెండే థియేటర్లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి తెలుగులో కూడా రెగ్యులర్ షోస్ పడనున్నాయి. ఒక్కమాటలో ‘ధురంధర్’ ది రివేంజ్ సినిమా పబ్లిక్ టాక్ ఏంటంటే హిట్ అని ప్రేక్షకులు తేల్చేశారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.