లింగ నిర్ధారణ కు బలవంతపు టెస్టులా?... ఇందిరాపార్కు వద్ద క్వీర్, ట్రాన్స్జెండర్ల ఆందోళన

లింగ నిర్ధారణ కు బలవంతపు టెస్టులా?... ఇందిరాపార్కు వద్ద క్వీర్, ట్రాన్స్జెండర్ల ఆందోళన
  •     ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే
  •     సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ముషీరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టిన ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు-2026’ను వ్యతిరేకిస్తూ ట్రాన్స్​జెండర్, క్వీర్ వర్గాలు బుధవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాయి. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న చట్టపరమైన రక్షణలను ఈ బిల్లు నీరుగారుస్తోందన్నారు.

ఈ ధర్నాలో స్వేచ్ఛ, కాళీ, లిల్లీ, నిత్య తదితర నేతలు మాట్లాడుతూ.. ముఖ్యంగా లింగ నిర్ధారణ కోసం బలవంతపు వైద్య పరీక్షలను తప్పనిసరి చేయడం అశాస్త్రీయమని, ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుందని ఆవేదన చెందారు. తక్షణమే ఈ వివాదాస్పద సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.