మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్రం 2026 జనవరి 30వ తేదీ, శుక్రవారం తెలుగు భాషలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
రియల్ లైఫ్‌లో రూమర్డ్ లవర్స్‌గా వైరల్ అవుతున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలో రేపు గురువారం పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ALSO READ : సుహాస్ నుంచి మరో ఫన్ బ్లాస్ట్ గ్యారంటీ.. ‘హే భగవాన్’ టీజర్ అదిరింది
ఇదే సమయంలో సినిమా టికెట్లపై ఓ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. నిజమైన కపుల్స్‌కు 1+1 టికెట్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ఆఫర్ వర్తించనుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#OmShantiShantiShantihi paid premieres with a fantastic offer! ✨️
— Star Circle (@TeamStarCircle) January 28, 2026
Couples get 1+1 tickets at selected centres 🎟️
Paid Premieres TOMORROW!
Grab your Tickets now! 🤩#OmShantiShantiShantihi In theatres from 30th January 💖#OSSS #OSSSTrailer #OSSSonJan30th#TharunBhascker… pic.twitter.com/IPs58a9bdQ
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్న థియేటర్ల జాబితాను చిత్ర బృందం వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
• ఏషియన్ ముక్త సినిమాస్-అగనంపూడి (విశాఖపట్నం)
• వీపీసీ థియేటర్- అమలాపురం
• మినీ రేవతి- మచిలీపట్నం
• గౌతమి థియేటర్-అనంతపురం
విడుదల తర్వాత ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
