టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అనే క్యాచీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాలతో యువత మనసు దోచుకున్న శివాని నాగరం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు నరేష్, కామెడీయన్ సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ‘హే భగవాన్’ టీజర్ను విడుదల చేశారు. టీజర్ మొత్తం సస్పెన్స్, కామెడీ మేళవింపుతో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఎలాగైనా తన తండ్రి బిజినెస్‌ను తానే టేకప్ చేయాలనే తాపత్రయంతో ఉండే కొడుకు పాత్రలో సుహాస్ నవ్వులు పూయిస్తున్నారు.
టీజర్‌లో వచ్చే సన్నివేశాలు, శివాని నాగరం వేసే క్రేజీ జోక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా “ఎంతో మంది ఇళ్లలో దీపాలు వెలిగించాడండీ..” అనే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. ఓవరాల్‌గా టీజర్ చూస్తుంటే, ఈ మూవీతో ప్రేక్షకులు ‘సుహాస్ 2.0’ను చూడబోతున్నారనే క్లారిటీ వస్తోంది.
ALSO READ : యూత్‌ని కట్టిపడేసే కొత్త సాంగ్.. కళ్లకు కట్టినట్లుగా జీవిత ఇబ్బందులు
అలాగే, ఇందులో కామెడీతో పాటు బలమైన ఫాదర్–సన్ ఎమోషన్ కూడా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు ‘రైటర్ పద్మభూషణ్’ ఫేం షణ్ముక ప్రశాంత్ కథను అందించాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఫిబ్రవరి 20న ఈ సినిమా ఎలాంటి ఫన్ బ్లాస్ట్ అందించబోతోందో చూడాలి.
