రాజకీయ నాయకులు.. పొలిటికల్ లీడర్స్ బిజీగా ఉంటారు. రోడ్డు, రైలులో వెళ్లాలంటే రోజులు పడుతుంది. అందుకే చార్టర్డ్ విమానాలు, హెలికాఫ్టర్లు ఉపయోగిస్తుంటారు. ఇది సాధారణం. సర్వ సాధారణం. అప్పుడప్పుడు జరిగే విమాన ప్రమాదాలు.. ప్రముఖ రాజకీయ నాయకులను శాశ్వతంగా దూరంగా చేస్తుంటుంది. 2026, జనవరి 28వ తేదీ మహారాష్ట్రలో జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయారు. ఈ క్రమంలోనే ఈ చార్టర్డ్ ఫ్లయిట్ ఏంటీ.. దాని ప్రత్యేకత ఏంటీ అనేది ఆసక్తిగా మారింది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చార్టర్డ్ ఫ్లయిట్ లియర్ జెట్ 45XR :
>>> అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం లియర్ జెట్ 45XR మోడల్.
>>> VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన విమానం ఇది. ఈ కంపెనీ హెలికాఫ్టర్లు, చార్టర్డ్ విమానాలు, చార్టర్లు అద్దెకు ఇస్తుంది. దేశంలోనే అతి పెద్ద నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ సంస్థ.
>>> ఇదే కంపెనీకి చెందిన చార్టర్డ్ విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ తన ఎన్నికల ప్రచారం కోసం వెళుతూ ప్రమాదానికి గురై చనిపోయారు.
>>> ఈ విమానం 1998 నుంచి 2009 మధ్య కాలంలో తయారైన మోడల్ విమానం.
>>> ఈ చార్టర్డ్ విమానం ఒక్కసారి గాల్లోకి లేస్తే.. 2 వేల 200 నాటికల్ మైళ్లు ఆగకుండా ప్రయాణిస్తుంది. హై స్పీడ్ కు ఇది ఫేమస్.
>>> రెండు ఇంజిన్లతో నడిచే ఈ మోడల్ విమానం.. 51 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదు. 10 వేల కిలోల వరకు బరువు ఉంటుంది. 47 అడుగుల వెడల్పుతో రెక్కలు ఉంటాయి.
>>> ఈ చార్టర్డ్ విమానంలో ఎనిమిది మంది కూర్చోవచ్చు.
>>> VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంది. ఈ కంపెనీ ఓనర్ వి.కె.సింగ్.
బిజినెస్, పొలిటికల్ లీడర్లు ఎక్కువగా ఇలాంటి మోడల్ విమానాలనే ఉపయోగిస్తుంటారు. సౌకర్యవంతంగా ఉంటుంది.. హై స్పీడ్ ఉంటుంది.. అంతకు మించి సినిమా స్టయిల్ లో కంఫర్ట్ ఉంటుంది. దేశంలో చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తమ తమ పర్యటనల కోసం ఈ మోడల్ చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటుంటారు. ఇలాంటి మోడల్ విమానంలోనే ఇప్పుడు అజిత్ పవార్ ప్రయాణిస్తూ.. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి పేలిపోయింది.
