ఇజ్జత్ కా సవాల్..! కమలనాథుల అంతర్మథనం.. పట్టణ ప్రాంతాల ప్రజలు ఆదరిస్తారా? పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా?

ఇజ్జత్ కా సవాల్..! కమలనాథుల అంతర్మథనం.. పట్టణ ప్రాంతాల ప్రజలు ఆదరిస్తారా? పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా?
  • అందరి దృష్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల వైపే 
  • హాట్ టాపిక్ గా మారిన పురపోరు

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి ఇజ్జత్ కా సవాల్ గా మారనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ మేరకు సీట్లు సాధిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర తెలంగాణలో పట్టున్న కమలం పార్టీ దానిని ఈ ఎన్నికల్లో నిలుపుకొం టుందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కేవలం 710 సర్పంచ్ స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 7.527 స్థానాలు దక్కగా.. 3,511 సర్పంచ్ స్థానాలతో బీఆర్ఎస్ రెండో ప్లేస్ లో నిలిచింది. బీజేపీ తమకు పట్టణ ప్రాంతాల్లో బలం ఉందని చెబుతూ ఉంటుంది. 

ఈ సారి రా ష్టంలోని 116 పట్టణాలు, ఏడు కార్పొరేషన్లలోని పాలక వర్గాలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని పట్టణాల్లో పాగా వేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడిజిల్లాల్లో బలమైన పార్టీగా బీజేపీ ఎదిగింది. ఇక్కడి పట్టణాల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, కామా రెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆర్కూర్, గోషామ హల్ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. ఇందులో ఆదిలాబాద్, నిజామాబాద్ రెండు జిల్లా లకు సంబంధించినవే ఏడు అసెంబ్లీ స్థానాలున్నా యి. 

ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్, బాద్, ఆదిలాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. కరీంనగర్. మల్కాజ్ గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మెదక్ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బలాన్ని పెంచుకోగలిగింది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూ బీజేపీ సత్తా చాటింది. అయితే పంచాయతీల వద్దకు వచ్చే సరికి చతికిలపడిపోయింది. దీంతో ప్రస్తుతం జరగబోయే బల్దియా ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందనేది అంతు చిక్కడం లేదు. ఒక వేళ పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే ఎలా అన్న సందేహాలు పార్టీ కేడర్ ను వెంటాడుతున్నాయి.