నవ నాయకుల ఫలితాలు: భూముల ధ‌ర‌లకు రెక్కలు.. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి..!

నవ నాయకుల ఫలితాలు: భూముల ధ‌ర‌లకు రెక్కలు.. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి..!

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రకృతి ఎలా ఉంటుంది. ప్రపంచానికి రాజుగా ఏ గ్రహం ఉంటుంది. ఈ ఏడాది కుజ గ్రహం పాత్ర ఏమిటి.. వ‌ర్షాలు.. పంట‌లు ఎలా ఉంటాయి.. భూముల ధ‌ర‌లు ఎలా ఉంటాయి.. ర‌క్షణ రంగం ప‌రిస్థితి ఎలాఉంటుంది. మొద‌ల‌గు విష‌యాల గురించి పండితులు ఏమంటున్నారు.

రాజు గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశం సుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎప్పుడూ లేని విధంగా అధికంగా ధరలు పెరుగుతాయి. సామాన్యుడికి బంగారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది.

ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్నప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశు, పక్షి సంతతిని రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫానులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.

వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్ను బట్టి కాకుండా బ్యాక్ గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పరం అవుతాయి. బంగారు ఆభరణాలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది.

సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ధర్మసత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది. హైందవ ధర్మం ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది.

మంత్రి- కుజుడు: మంత్రిత్వం కుజునికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్నిప్రమాదాల జరుగుతాయి. ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది.

రాజకీయాలలో కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధరలు. కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా రాణిస్తారు. యువత పెడదోవ పడతారు. వాయు కాలుష్యం పెరుగుతుంది.

సేనాధిపతి - చంద్రుడు: సేనాధిపత్యం చంద్రుడుకి రావడం వలన భూముల ధర పెరుగుతుంది. అన్నివస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. 

పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాలలోని వారికి పేరు. ప్రఖ్యాతులు లభిస్తాయి. సస్యాధిపతి శుక్రుడు సస్యాధిపత్యం శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరులై పారుతుంది.

ప్రతి విషయంలో స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థినీ విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది. చెలరేగిపోతారు. క్రీడారంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. సినీ, కళారంగాలలోని వారికి, సాహిత్య రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది.

ధాన్యాధిపతి - బుధుడు: ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్నితినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్నినిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది.

దుంప కూరలు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్ట్స్ లకు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారికి. బోధనారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

అర్ధ్యాధిపతి - చంద్రుడు: అర్ధ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండును. పాల ఉత్పతులకు సంబందించిన అన్ని రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు వుంది. కొన్ని చోట్ల వర్షపాతం. తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధర కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి అధిక ధరలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వున్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

మేఘాధిపతి - చంద్రుడు: మేఘాధిపతి చంద్రుడుకి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధరకలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గో సంపద పెరుగుతుంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన ఆకాల వర్షాలు కురిసే అవకాశం వుంది. 

రసాధిపతి- రవి: రసాధిపతి. రవికి రావడం వలనగోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధించిన వస్తువులు అధిక ధర ఉంటుంది. తేనె, కందులు అధిక ధరలు కలిగి ఉంటాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు గడ్డుకాలమ‌ని(కొంతమందికిమాత్రమే) జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

పంచాంగ కర్త: కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి