ఆధ్యాత్మికం: సాయంత్రం(2026 జూన్27) కాకులకు చీమలకు ఆహారం ఇవ్వండి.. శని దేవుడి అనుగ్రహం.. కష్టాలు పరార్

ఆధ్యాత్మికం:  సాయంత్రం(2026 జూన్27)  కాకులకు చీమలకు ఆహారం ఇవ్వండి.. శని దేవుడి అనుగ్రహం.. కష్టాలు పరార్

హిందూ పురాణాల ప్రకారం  శనివారం  విష్ణువుకు.. శని భగవానుడికి ఇష్టమూన రోజు . ఇక శని వారంతో పాటు  త్రయోదశి తిథి వచ్చే ఆరోజు  శనీ భగవానుడికి ఎంతో ఇష్టం . మరో విషయం ఏంటంటే త్రయోదశి తిథి రోజు సాయంత్రం ఘడియలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు జూన్ 27న వచ్చింది శని త్రయోదశి.  ఈ రోజు సాయంత్రం కాకులకు.. చీమలకు ఆహారం పెడితే శని దేవుడి అనుగ్రహంతో కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

హిందువులు  శని త్రయోదశి రోజును చాలా ప్రత్యేకంగా భావిస్తారు.  ఆరోజు శనీశ్వరునికి పూజలు చేస్తే జాతకంలో శని దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  శని త్రయోదశి అంటే.. శనివారం.. త్రయోదశి తిథి ఉండాలి.అలాంటి విశిష్టమైన రోజు 2026 జూన్​ 27 న వచ్చింది.  ఆ రోజున శని భగవానుడిని పూజించడంతో పాటు.. మూగజీవాలైన కాకులకు... చీమలకు ఆహారం పెడితే జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలనుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

హిందువులు శని త్రయోదశిని శని ప్రదోషం అంటారు. శనివారం.. త్రయోదశి తిథి ఉన్న రోజును శనిత్రయోదశిగా పరిగణిస్తారు.  ఆ రోజు   శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు.  ఆ రోజున శివాలయంలో శని భగవానుడిని పూజిస్తే కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి శివుడు, పార్వతి దేవి ...  శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఆ  రోజున శని భగవానుడిని ఆరాధిస్తే...   శని  ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు. శనిదోష ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి.  

శని త్రయోదశి తేదీ మరియు సమయం

  • శని త్రయోదశి  తేదీ:  2026 జూన్​  27
  •  త్రయోదశి తిథి ప్రారంభం:    ఉదయం 10:22 గంటలకు 
  •  త్రయోదశి తిథి ముగింపు:  రాత్రి  12:23 గంటలకు
  • శని త్రయోదశి పూజలకు శుభ ముహూర్తం: సాయంత్రం 07:04 నుండి రాత్రి 09:06 వరకు

శని త్రయోదశి రోజున  ( జూన్​ 27) పాయంత్రం శివాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి.. శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి.  తరువాత తమలపాకులో నువ్వులు.. బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.  ఆ తరువాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి.  ఆ తరువాత స్నానం చేసి.. మరల శివాలయంలో శివుడికి గాని.. ఆంజనేయ స్వామికి గాని 11 ప్రదక్షిణలు చేయాలి. 

 శని వాహనం కాకి.. కావున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పూజారులు చెబుతున్నారు. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి.  ఆ తరువాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో  ప్రయోజనం ఉంటుంది.  శని భగవానుడి భార్య జ్యేష్టాదేవి.. రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది.  శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు.. శని దోషం తొలగిపోతుంది. 

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
 

జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం అంటే  భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు.  ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. కనుక ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుధ్ధిగా పూజిస్తే అంతా శుభమే.శని అని...  ఏలినాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి .చక్కగా అతన్ని స్మరించండి చాలు... ఆయన అనుగ్రహం ఉంటే  అన్ని సమస్యలనుండి బయటపడేస్తాడని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.