హైదరాబాద్లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. XUV 700 కారులో 8 మంది బీటెక్ స్టూడెంట్స్.. ఓవర్ స్పీడుతో..

హైదరాబాద్లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. XUV 700 కారులో 8 మంది బీటెక్ స్టూడెంట్స్.. ఓవర్ స్పీడుతో..

అర్థరాత్రి కదా.. రోడ్లపై ఎవరూ ఉండరూ.. ఎంత స్పీడ్ వెళ్తే అంత కిక్కు.. అన్నట్లుగా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ యూత్ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రిపీటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం (జనవరి 27) హైదరాబాద్ లో జరిగిన యాక్సిడెంట్.. ఇద్దరు బీటెక్ స్కూడెంట్స్ మృతికి కారణమైంది. బోడుప్పల్  పిల్లర్ నెం.97 ను ఢీకొని కారు పల్టీ కొట్టడంతో ఘోరం జరిగిపోయింది. 

కారు డ్రైవర్ అతివేగానికి  ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు   మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.  మేడిపల్లి పీఎస్ పరిధిలోని అర్ధరాత్రి   పిల్లర్ నెం. 97 వద్ద జరిగింది ఈ ఘోర ప్రమాదం జరిగింది.  XUV 700 కారు  బోడుప్పల్ నుండి ఐటి పోచారం వైపు కారులో ( టిఎస్ 32 జి 1888) ప్రయాణిస్తుండగా.. కారు ఓవర్ స్పీడు కారణంగా పిల్లర్‌ 97ను ఢీకొట్టింది. 

కారులో వనపర్తి జిల్లాకు చెందినవ  8 మంది బీటెక్ విద్యార్థులు ఉన్నారు.  ఈ ప్రమాదంలో సాయి వరుణ్,  నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.  వెంకట్ , రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  మిగిలిన సాత్విక్, హర్షవర్దన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని  శ్రీకర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాక్సిడెంట్ కు గల కారణాలను తెలుసుకున్నారు.  మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.