అక్రమ అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు :  కలెక్టర్ బాదావత్ సంతోష్

అక్రమ అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు :  కలెక్టర్ బాదావత్ సంతోష్
  • నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్

 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని సాయికృప ప్రైవేట్ ఆస్పత్రిలో బాలికకు అక్రమంగా అబార్షన్ నిర్వహించారనే ఆరోపణల నేపథ్యంలో, జిల్లా కమిటీ నిర్ణయం మేరకు ఆ ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఉన్న 38 స్కానింగ్ సెంటర్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ చట్టం-2010 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్, అడిషనల్​ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఉన్నారు.