IND vs NZ: సెలక్ట్ చేసి అవమానించడం అంటే ఇదే.. అయ్యర్‌కు టీమిండియా తీవ్ర అన్యాయం

IND vs NZ: సెలక్ట్ చేసి అవమానించడం అంటే ఇదే.. అయ్యర్‌కు టీమిండియా తీవ్ర అన్యాయం

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు మరోసారి నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వలేదు. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషాన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. కిషాన్ స్థానంలో అయ్యర్ కు కాకుండా ఒక స్పెషలిస్ట్ సీమర్ కు ఛాన్స్ ఇచ్చారని నెటిజన్స్ ఫైరవుతున్నారు. సిరీస్ గెలిచినా.. కిషాన్ గాయపడిన శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.    
 
వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు:  

ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. అంతకంటే ముందు ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను సన్నాహకంగా ఉపయోగించుకుంటుంది. భారత టీ20 జట్టులో ఉన్న తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీలో గాయం కావడంతో ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ తో జరగబోయే తొలి ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ఆడే అవకాశాలు లేవు. ఎందుకంటే వరల్డ్ కప్ లోపు తిలక్ వర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించడం కన్ఫర్మ్ అయింది. తిలక్ కోలుకొని వరల్డ్ కప్ సమయానికి భారత జట్టులోకి వస్తాడు. 

తిలక్ టీమిండియాలో చేరితే శ్రేయాస్ అయ్యర్ పై మరోసారి వేటు పడడం గ్యారంటీ. వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కు న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో స్థానం దక్కట్లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. వరల్డ్ కప్ స్క్వాడ్ లో శ్రేయాస్ లేకపోవడంతో అతను న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయ్యర్ స్థానంలో వరల్డ్ కప్ స్క్వాడ్ లో మరొకరికి స్థానం ఇస్తే మెగా టోర్నీకి ముందు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చూసుకుంటే అసలు శ్రేయాస్ అయ్యర్ ను ఎందుకు సెలక్ట్ చేసారో అర్ధం కావడం లేదు.