Sankranthi Movie OTT: ఓటీటీలోకి వస్తోన్న తొలి సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ & ప్లాట్‌ఫామ్ ఇదే!

Sankranthi Movie OTT: ఓటీటీలోకి వస్తోన్న తొలి సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ & ప్లాట్‌ఫామ్ ఇదే!

మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ మూవీ త్వరలో OTTలోకి రానుంది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సంక్రాంతి స్పెషల్గా జనవరి 13న విడుదలైంది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే, ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 (Zee5) భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే నెల ఫిబ్రవరి 13, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ తేదీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అంతేకాదు, అనుకున్న తేదీ కంటే ముందే స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమూ ఉందని కూడా టాక్. 

కథ విషయానికి వస్తే..

రవితేజ ఓ వ్యాపారవేత్త పాత్రలో కనిపిస్తారు. యూరప్ బిజినెస్ ట్రిప్ సమయంలో అశికా రంగనాథ్‌తో ఏర్పడిన పరిచయం, ఆపై శారీరక సంబంధం ఆయన దాంపత్య జీవితంలో సమస్యలకు దారి తీస్తుంది. ఈ క్రమంలో భార్య డింపుల్ హయతితో ఉన్న వివాహ బంధంలో కలిగే సంఘర్షణలే కథాంశం.

►ALSO REA D | Ranbir Kapoor: ప్రభాస్ తర్వాతే రణబీర్.. 'యానిమల్ పార్క్' పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్!

సినిమాలో కొంతవరకు కామెడీ ఆకట్టుకున్నప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయాయి. పైగా సంక్రాంతి 2026 బరిలో ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి వంటి భారీ సినిమాలు విడుదలవడంతో సంక్రాంతికి సక్సెస్ సాధించడంలో రవితేజ సినిమా వెనుకబడిపోయింది.

అయితే, రవితేజ నటనకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా పాత్రను ఎంచుకోవడాన్ని ప్రేక్షకులు అభినందించారు. పాటలు, ఫస్ట్ హాఫ్ కామెడీ బాగున్నా.. కిషోర్ తిరుమల మార్క్ సబ్‌టిల్ హ్యూమర్, భావోద్వేగ లోతు ఈసారి పూర్తిగా కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

రవితేజ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజా.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఇది తండ్రి–కుమార్తె భావోద్వేగ కథతో, తక్కువ బడ్జెట్‌లో రూపొందుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాతో అయినా రవితేజకు ఘన విజయం దక్కుతుందేమో చూడాలి..!