మెగా ఫ్యామిలీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఇటీవల చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్' బాక్సాఫీప్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ భారీగా వసూళ్లు రాబట్టింది. మెగాస్టార్ తన వింటేజ్ మేజిక్‌ను పునరావృతం చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరో వైపు మెగా కోడలు ఉపాసన రెండో సారి తల్లి కాబోతున్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జనవరి 31న ఆమె డెలివరీ కాబోతుందనే ప్రచారం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
వారసుడి కోసం చిరు ఎదురుచూపు..
గత ఏడాది దీపావళి వేళ ఉపాసన గర్భవతి అనే విషయాన్ని ఈ దంపతులు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే సీమంతం వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి. అయితే ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది ఏమిటంటే.. ఉపాసన ఈసారి కవల పిల్లలకు (Twins) జన్మనివ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 2012లో వివాహం చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన జంటకు, దాదాపు 11 ఏళ్ల తర్వాత 2023 జూన్‌లో క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారకు తోడుగా తమ్ముళ్లు లేదా చెల్లెళ్లు రాబోతున్నారనే వార్త వినగానే అభిమానులు 'మెగా సంబరాలు' మొదలుపెట్టేశారు. ఒకవేళ ఇదే నిజమైతే, మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద 'మెగా' జోరు
ఒకవైపు కుటుంబంలో సంతోషం, మరోవైపు సినిమాల పరంగా మెగా హీరోలు దూసుకుపోతున్నారు.పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి మాస్ హిట్‌ను అందుకున్నారు. అటు చిరంజీవి'మన శంకర్ వరప్రసాద్' చిత్రంతో మెగాస్టార్ తన వింటేజ్ మేజిక్‌ను పునరావృతం చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలాంటి విజయాల పరంపరలో రామ్ చరణ్ తన తర్వాతి చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఉపాసన డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతో, చరణ్ తన షూటింగ్ షెడ్యూల్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని భార్య దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
'పెద్ది' విడుదలపై ప్రభావం?
వాస్తవానికి 'పెద్ది' సినిమాను మార్చి చివరలో విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇంకా కొంత వర్క్ పెండింగ్‌లో ఉండటం, చరణ్ ఫ్యామిలీకి టైమ్ కేటాయించాల్సి రావడంతో ఈ సినిమా విడుదల జూన్ నెలకి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మెగా వారసుడి రాక తర్వాతే చరణ్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారట. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకవైపు వరుస హిట్లు, మరోవైపు ఇంట్లోకి కొత్త అతిథి రాక.. ఇవన్నీ చూస్తుంటే మెగా అభిమానులకు ఇది నిజంగానే పండగే.. జనవరి 31న రాబోయే ఆ 'గుడ్ న్యూస్' కోసం కేవలం కొణిదెల కుటుంబమే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
