వాళ్లది రెండేళ్ల ప్రేమ. వయసులోనూ, హోదాలోనూ పెద్దదైన HR మేనేజర్ తో ప్రేమాయణం నడిపాడు కంప్యూటర్ ఆపరేటర్. ఆఫీసులో చాటు మాటు సరసంతో ముందుకు సాగుతున్న లవ్.. ఒక్కసారిగా క్రూరమైన టర్న్ తీసుకుంది. తన లవర్ తల నరికి చేతులు కాళ్లూ వేరు చేసి.. తల ఒక ప్యాక్ లో.. మితగా పార్ట్స్ బ్యాగులో కుక్కి నదిలో పడేశాడు నిందితుడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణ హత్య.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రాలో జరిగింది ఈ మర్డర్. తెధీ బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ అనే హెచ్ఆర్ మేనేజర్ జనవరి 23న అఫీసుకు వెళ్లి తిరిగి రాలేదని రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 24న ఇతమదుల్లా పోలీస్ స్టేషన్ ఏరియాలోని జవహార్ బ్రిడ్జి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్యాగులో తల లేని మొండెంతో పాటు కాళ్లు చేతులు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు షాకయ్యారు.
ఈ ఘటనపై స్పెషల్ టీమ్ తో దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ సయీద్ అలీ అబ్బాస్ చెప్పారు. మిస్సింగ్ కేసు, సీసీటీవీ ఫూటేజ్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆఫీస్ బిల్డింగ్ నుంచి బ్యాగ్ ను ఈడ్చుకురావడం.. బ్రిడ్జి వైపు బ్యాగుతో స్కూటీపై వెళ్లడం పోలీసులు గుర్తించారు.
యంజీ రోడ్డులోని మారుతి ప్లాజా ఫుటేజ్ ప్రకారం.. నిందితుడు హెచ్ఆర్ మేనేజర్ ఆఫీసులో పనిచేసే వినయ్ సింగ్ గా గుర్తించారు. వినయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో నిజాలను కక్కించారు. తన లవర్ మింకీ శర్మను చంపేసినట్లు తప్పు ఒప్పుకున్నాడు.
అందుకే చంపేశా..
తమది రెండేళ్ల ప్రేమ అని హంతకుడు వినయ్ సింగ్ విచారణలో చెప్పాడు. ఇద్దరం రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని.. కానీ ఆమె గత ఆరు నెలలుగా వేరొకరితో సన్నిహితంగా ఉండటంతోనే హత్య చేసినట్లు తెలిపాడు. మింకీ శర్మ ఆరు నెలలుగా మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఈ హత్య చేసినట్లు చెప్పాడు.
హత్య జరిగింది ఇలా..
జనవరి 23న ఆఫీసుకు రమ్మని ఫోన్ చేసిన వినయ్ సింగ్.. మింకీ శర్మ రాగానే గొడవకు దిగాడు. మాటకు మాట పెరిగి సహనం కోల్పోయిన సింగ్.. ప్రీ ప్లాన్డ్ గా వెంట తెచ్చుకున్న కత్తితో పసా పసా మెడపై పొడిచేశాడు. ఆ తర్వాత మెడను శరీరంతో వేరు చేశాడు. బాడీని ఒక బ్యాగులో కుక్కి ప్లాస్టర్ తో సీల్ చేశాడు. మరో కవర్ లో తలను ప్యాక్ చేసి కనబడకుండా ప్లాస్టర్ వేశాడు.
డెడ్ బాడీని యమునా నదిలో పడేసేందుకు మింకీ సింగ్ స్కూటీని వినియోగించాడు హంతకుడు. బ్యాగును నదిలో పడేయాలని వెళ్లినప్పటికీ.. బరువు ఎత్తలేక ఇబ్బంది పడుతున్న క్రమంలో.. స్థానికులు చూస్తున్నారని బ్యాగును బ్రిడ్జిపైనే వదిలేసి పారిపోయినట్లు పోలీసులతో తెలిపాడు. ఆ తర్వాత తల, బట్టలు, ఫోన్ దగ్గర్లోని ఒక మురికి కాలువలో పడేసినట్లు చెప్పాడు.
రెండేళ్లుగా ప్రేమించిన వ్యక్తిని ఇంత రాక్షసంగా ఎలా చంపావని ప్రశ్నించగా.. పెళ్లి విషయంలో వచ్చిన గొడవతో సహనం కోల్పోయినట్లు చెప్పాడు. మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉండటంతోనే తనతో పెల్లికి ఒప్పుకోలేదని.. అందుకే చంపేసినట్లు తెలిపాడు. హత్య, ఎవిడెన్స్ లేకుండా చేసినందుకు భారతీయ న్యాయసంహిత ప్రకారం కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
