ఏదో ఒకరోజు నీ బాడీ కూడా ఫ్రిజ్లోనే.. మాటవరుసకు అన్నదే నిజమైంది.. పాపం ఈ డెంటిస్ట్..

ఏదో ఒకరోజు నీ బాడీ కూడా ఫ్రిజ్లోనే.. మాటవరుసకు అన్నదే నిజమైంది.. పాపం ఈ డెంటిస్ట్..

కష్టపడి చదివి పీజీ వరకు వచ్చింది. మంచి డిమాండ్ ఉన్న డెంటిస్ట్రీలో పీజీ చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో డాక్టర్ అనిపించుకునే లోపే.. బాయ్ ఫ్రెండ్ వేధింపులకు తాళలేక సూసైడ్ చేసుకుంది. ముంబైలో డెంటిస్ట్ స్టూడెంట్ ఆత్మహత్య సంచలనంగా మారింది. తన లవర్ అనుమానిస్తూ.. క్యారెక్టర్ పై ఆరోపణలు చేయడం తట్టుకోలేక చనిపోవడం తీవ్ర విషాదంలో ముంచేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. స్తుతి సోన్వానే (24) అనే MDS స్టూడెంట్ ముంబైలో తన రూమ్ లో సూసైడ్ చేసుకుంది. లవర్ అనుమానించడం, క్యారెక్టర్ అసానిసినేషన్ కారణంగానే చనిపోయినట్లు ఆమె సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఇద్దరి రిలేషన్ షిప్ పూర్తిగా అనుమానాలతో నిండిపోయి ఆత్మహత్య వరకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

స్తుతి సూసైడ్ నోట్ చదివితే.. ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుకు వస్తుందని  పోలీసులు తెలిపారు. బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ ను హత్యచేసి, ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్ లో పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ కేసులో స్తుతిని ఫ్రిజ్ లో పెట్టకపోయినా.. ఢిల్లీ కేసును గుర్తు చేస్తూ.. ఆమె ఫ్రెండ్స్ సరదాగా అన్నమాటలు ఫ్రిజ్ హత్య కేసును గుర్తుకు తెస్తున్నాయి. 

►ALSO READ | ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ. 30 వేల లంచం.. కుత్బుల్లాపూర్ లో ఏసీబీకి చిక్కిన జీపీవో

స్తుతి రిలేషన్ షిప్ లో సమస్యలు, ప్రియుడి హరాష్​మెంట్ గురించి తెలిసిన ఫ్రెండ్స్.. ఏదో ఒక రోజు నీ డెడ్ బాడీ కూడి ఫ్రిజ్ లో దొరికే పరిస్థితి రానివ్వకు.. అంటూ సరదాగా అనేవారట. కానీ చివరికి అదే నిజమయ్యేలా ఉంది.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని రాయటం చర్చనీయాంశంగా మారింది. 

స్తుతి తన పేరెంట్స్, సిస్టర్ తో కలిసి ముంబై లోని అంటోప్ హిల్ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. సోమవారం (మార్చి 09) ఉదయం 11 గంటలకు కూడా ఆమె రూమ్ తలుపులు తెరవకపోడంతో.. అనుమానం వచ్చిన పేరెంట్స్ డోర్ తెరిచి చూసే సరికి గుండెలు పగిలే దృశ్యం చూసినట్లు చెబుతున్నారు. రూమ్ లో ఫ్యాన్ కు విగతజీవిగా వేలాడుతూ ఉండటం చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ కుప్పకూలిపోయింది. హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ వెల్లడించారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఒక అసాధారణ మృతిగా పేర్కొన్నారు. స్తుతి మృతికి సంబంధించి బాయ్ ఫ్రెండ్ ప్రమేయం గురించి ఆరాతీస్తున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.