ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ. 30 వేల లంచం.. కుత్బుల్లాపూర్ లో ఏసీబీకి చిక్కిన జీపీవో

ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ. 30 వేల లంచం.. కుత్బుల్లాపూర్ లో  ఏసీబీకి చిక్కిన జీపీవో

తెలంగాణలో ఏసీబీ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. లంచానికి అలవాటు పడిన అధికారులు  రోజుకో చోట  ఏసీబీకి దొరికిపోతున్నారు లేటెస్ట్ గా  మార్చి 2న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు  GPO ( గ్రామ పంచాయతీ ఆఫీసర్) గణేష్.

ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం బాధితుడి నుంచి జీపీవో గణేష్  రూ. 30 వేలు డిమాండ్ చేశాడు.  ఒప్పందం ప్రకారం ముందుగా రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే బాధితుడి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ  పక్కా ప్లాన్ తో   బాధితుడి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా  జీపీఓ గణేష్ ను  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.  

►ALSO READ | దృశ్యం సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు.. ఇంట్లో అందర్నీ చంపేసి మిస్సింగ్ కేసు.. పోలీసులకే చుక్కలు

2026 ఫిబ్రవరి 28న  కీసర పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హోంగార్డ్​ నాగేశ్, గాంధీ హాస్పిటల్  ఫోరెన్సిక్  డాక్టర్  సందీప్  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోస్టుమార్టం కోసం రూ. 40 వేల లంచం తీసుకుంటుండగా. ఔటర్  రింగ్  రోడ్డు వద్ద డబ్బులు ఇవ్వగా, ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.