సికింద్రాబాద్లో పుర్రె కలకలం.. ఎముకలు కూడా దొరికాయ్ !

సికింద్రాబాద్లో పుర్రె కలకలం.. ఎముకలు కూడా దొరికాయ్ !

సికింద్రాబాద్: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ రోడ్డులో నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని ఓ మనిషి పుర్రెతో పాటు ఎముకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు మనిషి పుర్రె కనిపించడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇది అస్తి పంజరమా లేక ఎవరైనా క్షుద్ర పూజలకు వాడారా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గత మే నెలలో ఇలాంటి ఘటనే పాల్వంచలో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లోరుగూడెంలో నాలుగు రోజుల వయసున్న మృత శిశువు పుర్రె కలకలం రేపింది. స్థానికుడు గోవర్ధన్ ఇంటి దగ్గర కుక్కలు శిశువు పుర్రె భాగాన్ని పీక్కుతింటూ కనిపించాయి. వెంటనే ఆయన స్థానిక పోలీసులతో పాటు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. టౌన్ ఎస్సై నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు పుర్రెను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : తెలంగాణలో 25 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం..