సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో మృతిచెందిన ప్రముఖులు

సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో మృతిచెందిన ప్రముఖులు

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద ఘటనతో యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ చనిపోయిన ఘటన.. విమాన ప్రయాణాలు మరింత ప్రమాదంగా మారుతున్న క్రమంలో  గతంలో జరిగిన విమాన ప్రమాదాలను గుర్తు చేసింది. అజిత్​ పవార్​ చనిపోయిన తరహాలోనే అనేక ప్రమాదాలు జరిగాయి. భారత్​ లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ, ప్రముఖుల లిస్టును ఒకసారి చూద్దాం..

హోమీ జహంగీర్​ భాభా(1966): భారత అణు విజ్ణాన కార్యక్రమానికి మార్గదర్శకుడు హోమీ జహంగీర బాబా  1966 జనవరి 24 విమాన ప్రమాదంలో చనిపోయారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్​ 101ప్రయాణిస్తుండగా జెనీవా  ఎయిర్ ట్రాఫిక్​ కంట్రోల్​ తో కమ్యూనికేషన్​ లోపించి స్విస్​లోని మోంట్​బ్లాంక్​ పై కూలిపోయింది. 

►ALSO READ | పాపం ఈ యువ పైలట్.. ఇప్పుడు హాట్ టాపిక్.. ఈ శాంభవి పాఠక్ !

సంజయ్​ గాంధీ(1980): కాంగ్రెస్​ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు అయిన సంజయ్​ గాందీ 1980 జూన్​ 3న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన విమానం ప్రమాదంలో మృతిచెందారు.  

జీఎంసీ బాలయోగి(2002)లో మార్చి 3న అప్పటి లోక్​ సభ స్పీకర్​, తెలుగు దేశం పార్టీ సీనియర్​ లీడర్​ జీఎంసీ బాలయోగి కృష్ణ జిల్లా కైకలూరు దగ్గర ప్రైవేట్​ హెలికాప్టర్​ చెరువులో కూలడంతో ప్రాణాలు కోల్పోగా.. 2004లో ప్రముఖ తెలుగు సినీ నటి సౌందర్య , ఆమె సోదరుడు కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు.  

2005లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, హర్యానా మంత్రిఓం ప్రకాష్​ జిందాల్​ కూడా హెలికాప్టర్​ప్రమాదంలో  మృతిచెందారు. ఢిల్లీనుంచి చండీగడ్​కు వెళ్తుండగా యూపీలో సహారన్​ పూర్​ దగ్గర హెలికాప్టర్​ కూలిపోయింది.ఈ ఘటనలో హర్యాన వ్యవసాయ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. 

2009 సెప్టెంబర్​ 2న అప్పటి ఉమ్మది ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి కూడా నల్లమల అడవుల్లో హెలికాప్టర్​ కూలిపోయి మృతిచెందారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వల్లే ప్రమాదం జరిగిందని తెలిసింది. 

2011 లో జరిగిన విమానప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్​ సీఎం  దోర్జీ ఖండు, 2021లో భారత దేశ తొలి చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​  బిపిన్​ ,అతని భార్య తమిళనాడులో ని కూనూరు సమీపంలో జరిగిన సైనిక హెలికాప్టర్​ కూలిపోయి దుర్మణం పాలయ్యారు. 

ఇక ఇటీవల 2025జూన్​ 12న గుజరాత్​ లోని అహ్మాదాబాద్​ లో జరిగి ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్​రుపానీ చనిపోయారు. 

ఇలా రెండు దశాబ్దాల్లో దాదాపు ఆరు విమానా ప్రమాదాల్లో అనేక మంది ప్రముఖులు ప్రాణాలుకోల్పోవడం ఇప్పుడు విమాన ప్రయాణం చర్చనీయాంశంగా మారింది.